23-03-2025 04:24:57 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని బూడిద గడ్డ బస్తీలో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బడికల రమేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, పట్టణ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ, యూత్ అధ్యక్షులు సబ్బని అరుణ్, నాయకులు సుందర్ రావు, కాంపల్లి రాజం తదితరులు పాల్గొన్నారు.