05-03-2025 12:26:23 AM
పాపన్నపేట, మార్చి 4:పాపన్నపేట మండలం చిత్రియాల్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంగళవారం నాడు మెదక్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆశీస్సులతో చిత్రియాల్ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఏడుపాయల మాజీ చైర్మన్ బాలాగౌడ్. మాజీ మార్కెట్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్రెడ్డి. తాజా మాజీ సర్పంచ్ లు జగన్ గురుమూర్తిగౌడ్, రాజయ్య లింగారెడ్డి, బద్రి మల్లేశం, తాజా మాజీ ఎంపీటీసీ కుబేరుడు, పీఏసీఎస్ చైర్మన్ గుణిశెట్టి మల్లేశం, నాయకులు వెంకటేశం, దుర్గయ్య, కిష్టా గౌడ్, సాయిరెడ్డి, ఏడుకొండలు, మల్లేష్, నర్సింలు, నాయకులు, కార్యాకర్తలు పాల్గొన్నారు.