21-04-2025 08:53:44 PM
కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను వెనక్కి లాగుతున్నారు
బిఆర్ఎస్ నేతల సమీక్ష సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడు,(గట్టుప్పల్),(విజయక్రాంతి): తెలంగాణ ప్రజల ఆశలు బాధలను సాటేల గలమెత్తి వరంగల్ సభకు నలుమూలల నుండి తరలిరావాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ప్రజలకు మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నియోజకవర్గంలోని ఘట్టుప్పల్ మండలంలో టిఆర్ఎస్ నేతల సమీక్ష సమావేశం లో ఆయన పాల్గొని మాట్లాడి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపారు. పార్టీ స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ, ఏప్రిల్ 27న వరంగల్ లోని ఎలగతుర్తిలో జరగబోయే పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త ధ్యేయంగా పెట్టుకోవాలని అన్నారు.
తెలంగాణను స్వరాష్ట్రంగా సాధించి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇప్పటికీ తమది అనుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు కేవలం మోసపూరితమని, ప్రస్తుతం పాలనలో ఉన్న వారు సంక్షేమ పథకాలను వెనక్కి లాగుతున్నారని విమర్శించారు.ఆసన్నమైందని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు ప్రజలను స్వచ్ఛందంగా సభకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమయం ఆసన్నమైనది ప్రజలు నలుమూలల నుండి తరలివచ్చి 25 ఏళ్ల పార్టీ పండుగ సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.