25-03-2025 12:00:00 AM
కుత్బుల్లాపూర్, మార్చ్ 24(విజయ క్రాంతి) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని రోడమేస్త్రి నగర్ లో షేక్ నయాబ్ రసూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు.అనంతరం కూన శ్రీశైలం గౌడ్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడమేస్త్రి నగర్ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నా రు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ప్రజలు ఉపవాసాలు ఉంటూ అల్లా ఆశీస్సులు పొందుతారని కొనియాడారు. అల్లా అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలు,తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరా రు.ఈ కార్యక్రమంలో షేక్ నయాబ్ రసూల్,ఖాదర్, జమీల్, మహమ్మద్ అప్రోజ్, సాజిద్, ముబాబషీర్, ఖదీర్, బాబ్బ, ఆజార్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.