మహేశ్వరం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్మారెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.