03-03-2025 01:39:33 AM
కామారెడ్డి, మార్చి2 (విజయక్రాంతి), కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో మల్లన్న పండుగ సం దర్భంగా గొల్లపల్లి యాదవ సంఘం తర పున ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మె ల్యే జాజాల సురేందర్ కి ఆదివారం ఆహ్వాన పత్రిక అందజేశారు. సోమవారం మల్లన్న కళ్యాణ ఉత్సవానికి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గొల్లపల్లి అటికెల పెద్ద మల్లేష్ యాదవ్, రామారెడ్డి మండల్ మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి, మరికంటి బుచ్చన్న, రామారెడ్డి మండల్ మాజీ రైతు కమిటీ అధ్యక్షులు గురజాల నారాయణరెడ్డి, మాజీ గొల్లపల్లి టిఆర్‌ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రెడ్డి మల్లేశ్, మాజీ సర్పంచ్ పడిగేల శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ పోతునూర్ ప్రసాద్, గొల్లపల్లి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.