15-02-2025 09:13:12 PM
రామయంపేట,(విజయక్రాంతి): గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ ఉత్సవాల్లో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Malkajgiri Former MLA Mynampally Hanumantha Rao) హాజరయ్యారు. మండల పరిధిలోని దామరచెరువు గిరిజన తండాలో సేవాలాల్ జయంతి ఉత్సవాలు(Sevalal Jayanti Celebration) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వచ్చిన హనుమంతరావుకు గిరిజన మహిళలు నృత్యాలు చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చౌదరి సుప్రభాత్ రావు. రమేష్ రెడ్డి. డేమే యాదగిరి. అల్లాడి వెంకటి. తదితరులు పాల్గొన్నారు.