calender_icon.png 25 November, 2024 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే మృతి

25-11-2024 01:46:12 AM

ఊకె అబ్బయ్యకు నేతల నివాళి

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 24 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య(70) శనివారం రాత్రి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అబ్బయ్య గత కొంత కాలంగా  అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇల్లెందు మండలం హన్మంతులపాడు గ్రామానికి చెందిన అబ్బయ్య 1983లో బూర్గంపాడు ఎమ్మెల్యేగా సీపీఐ నుంచి గెలుపొందారు.

2009లో టీడీపీ నుంచి, 1994లో సీపీఐ నుంచి ఇల్లెందు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి టీడీపీ సీటు కేటాయిస్తే భీ ఫారం మర్చిపోవడంతో స్వం త్రంత్ర అభ్యర్థిగా ఎడ్లబండి గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. అబ్బ య్య రాజకీ యం రంగ ప్రవేశం సీపీఐలో మొదలైంది. అతని తండ్రి సుదిమల్ల సంర్పంచ్‌గా ఉండేవారు. దీంతో సీపీఐ రాజకీయాలకు ఆకర్శి తుడై సింగరేణి ఉద్యోగాన్ని సైతం వదిలి రాజకీయాలవైపు వచ్చారు.

ఇల్లెందు నియోజకవర్గంలో సీసీఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీకి ధీటుగా పోరాటం చేశారు. ఆయన ధైర్యాన్ని గుర్తించిన సీపీఐ బూర్గంపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బరిలో దిం పింది. అక్కడ విజయం సాధించి పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ఇల్లెందు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు పోరాటం చేశారు.

నాటి సీఎం చంద్రబాబు మీటింగ్ బయ్యారంలో ఏర్పాటు చేసిన ఘణత ఆయనకు దక్కింది. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఇల్లెందు నియోజకవర్గంలో పారాలని తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన రెండు ఆశయాలు ఆచరణ నెరవేరలేదు. తనను నమ్మిన క్యాడర్‌ను కాపాడేందుకు ఎంతకైన శ్రమించే గుణం ఆయనకు ఉంది.

రాజకీయ జీవితం సీపీఐ నుంచి ప్రారంభమైనా తర్వాత టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా పార్టీలు మారారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉండగా మృతిచెందారు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు అబ్బయ్య భౌతిక కాయం హైదరాబాద్ నుంచి ఆయన స్వగ్రామమైన హన్మంతులపాడుకు చేరుకున్నది.

టీడీపీ నాయకులు ముద్రగడ వంశీ, పాలమూలు బాలకృష్ణ, కారునర్సన్న, చాందావత్ రమేష్ బాబు, శ్యామ్‌తివరి, చెలమల బాబు, ఉప్పునూతల రజేందర్ ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. సోమవారం ఉదయం అంత్యక్రియలు హన్మంతులపాడులో నిర్వహించనున్నారు.