calender_icon.png 9 January, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబద్ధపు ప్రచారాలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది

08-01-2025 01:42:48 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): అబద్ధ ప్రచారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో గద్దెనెక్కిందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(Former MLA Durgam Chinnaiah) ఆరోపించారు. బుధవారం బెల్లంపల్లిలోని పలు కార్మిక వాడలను సందర్శించి సింగరేణి విద్యుత్ సరఫరా నిలిపివేతపై కార్మికులను అడిగి తెలుసుకున్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్న ఆశతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని, కానీ ప్రజల ఆశలను ముఖ్యమంత్రి నీరుగారుస్తున్నారని ఎద్దేవా చేశారు.

బెల్లంపల్లి లో గత ప్రభుత్వం సింగరేణి కార్మికులకు, కార్మికేతరులకు పట్టాలు అందించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ని గెలిపిస్తే కార్మిక వాడల్లో విద్యుత్ సరఫరాను నిలిపి వేసిందన్నారు. కార్మికులకు కనీసం తాగునీరు కూడా కరువైందన్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. ఎన్నికల సమయంలో బెల్లంపల్లిలో ఉంటానని బాండ్ పేపర్ రాసిచ్చి వీకెండ్ ఎమ్మెల్యేగా చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారని ఆరోపించారు.

ప్రజలకు హామీలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ చొరవ చూపాలని అన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తున్న బి.ఆర్.ఎస్ నాయకులు ,కార్యకర్తలపై ప్రభుత్వం పుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నించినందుకే మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు పెట్టి కుట్ర పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి భయపెట్టాలని చూసిన ప్రజా సమస్యలపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. కక్షపూరితంగా కేసులు పెట్టి జైల్లో వేసిన సమస్యలపై పోరాటం ఆపేది లేదని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య హెచ్చరించారు.