calender_icon.png 23 November, 2024 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదినారాయణ చేతిలో మరోసారి మోసపోవద్దు: మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

23-11-2024 12:24:22 PM

బెల్లంపల్లి, (విజయ క్రాంతి): అరిజిన్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ఆదినారాయణ చేతిలో మరోసారి ఎవరు మోసపోవద్దని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం సోషల్ మీడియా ద్వారా చిన్నయ్య కోరారు. ఆదినారాయణ అనే వ్యక్తి గతంలో రైతులను మోసం చేసి జైలుకు వెళ్లి వచ్చారన్నారు. కన్నాల శివారులోని 89 /2 సర్వేనెంబర్ లో షిండే దేవానంద్ అనే రైతుకు చెందిన భూమిని దుర్గం చిన్నయ్య దగ్గర కొన్నానని మాయమాటలు చెబుతూ అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. ఈ భూమి తాను గానీ, ఆదినారాయణ గాని ఎవరి వద్ద కొనడం, అమ్మడం జరగలేదని స్పష్టం చేశారు. ఈ భూమి తో ఆదినారాయణ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ప్రజలు ఆదినారాయణ మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు.