calender_icon.png 25 March, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య

23-03-2025 12:15:48 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): తాండూరు మండలంలోని మసీదులో ఆదివారం స్థానిక నాయకులు ఎలుక రామచందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(Former Bellampalli MLA Durgam Chinnaiah) పాల్గొన్నారు. చిన్నయ్యను ముస్లిం పెద్దలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ముస్లిం సోదరులు నిర్వహించే ఇఫ్తార్ విందుల వల్ల సోదర భావం పెంపొందుతుందని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దత్తు మూర్తి, పురుషోత్తం గౌడ్, చింటూ తదితరులు పాల్గొన్నారు.