calender_icon.png 16 November, 2024 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం

16-11-2024 06:38:30 PM

కోదాడ: కోదాడ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుబంధు ఇవ్వకపోవడం దారుణమన్నారు. యాసంగికి ముందే రైతులందరికీ రైతుబంధు పైసలు ఇవ్వాలన్నారు. రైతులందరికి రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయాలన్నారు. ఆయా డిమాండ్ల సాధన కోసం తమ పార్టీ పక్షాన ఉద్యమిస్తామన్నారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.