25-03-2025 10:10:37 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి బిఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు సతీష్ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఘనత మాజీ శాసనసభ్యులు సురేందర్ కే దక్కిందని అన్నారు.
ఆయన పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, రాత్రి పగలు తేడా లేకుండా ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తిగా ప్రజల గుండెల్లో గుండెల్లో నిలిచి ఉన్నారని ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.