24-03-2025 08:13:28 PM
పాపన్నపేట: మండల పరిధిలోని తమ్మాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి మెదక్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ లావణ్య రెడ్డి, మాజీ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు తాడేపు సోములు, ఏడుపాయల దేవస్థానం మాజీ ఛైర్మెన్ బాలగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మెన్ పోలీస్ వెంకట్రాంరెడ్డి రెడ్డి, మండల మాజీ సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు జగన్, మాజీ ఎంపీపీ దుర్గయ్య, తాజా మాజీ సర్పంచ్ లు శ్రీనాథ్ లింగారెడ్డి, మల్లేశం, గ్రామ అధ్యక్షులు సుభాష్ రెడ్డి, నాయకులు అనిల్ రెడ్డి, శ్రీశైలం, సాయిలు, మనోహర్, రాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.