24-03-2025 11:13:22 PM
సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని గార్డేగమ గ్రామంలో సోమవారం బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కూతురు శ్రేయ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అయన వెంట మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాలాజీ రావు, కేరోబా రావు, పండరి గొండ, కురుమ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.