24 May, 2026 | 4:38 PM

అడ్డేసార సర్పంచ్ పంద్రం శేకును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు

24-05-2026 03:32 PM

జైనూర్,(విజయకాంతి): జైనూర్ మండలం అడ్డేసార గ్రామ సర్పంచ్ పంద్రం శేకు అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు శనివారం పరామర్శించారు.ఆసుపత్రికి వెళ్లిన ఆత్రం సక్కు సర్పంచ్ శేకు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. "అవసరమైన అన్ని వైద్య పరీక్షలు సకాలంలో నిర్వహించి కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా చూడాలి" అని వైద్య సిబ్బందికి సూచించారు.శేకు త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆత్రం సక్కు ఆకాంక్షించారు. ఆయన వెంట ఎన్‌ఎస్‌యూఐ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి జమీర్ ఉన్నారు.