కరీంనగర్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో జరిగిన అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరుగుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు, ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ శాసన సభ్యులు ఆరేపల్లి మోహన్ పేర్కొన్నారు. ఆదివారం జరిగిని జిల్లా ప్రణాళిక సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) చేసిన అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డి శాసనసభ్యుడు అయి ఉండి తోటి శాసనసభ్యుడైన సంజయ్ కుమార్ ను అడ్డుకొని దాడి చేయడం బాధాకరమన్నారు. వీధి రౌడీల ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డిని శాసన సభ్యుడి హక్కులకు భంగం కలిగించినందుకు శాసన సభ్యుడి పదవి నుండి భర్త రఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. నేను కూడా గతంలో శాసనసభ్యుడిగా పనిచేశాను కానీ ఇలాంటి సంఘటనలు ఎన్నడు చూడలేద అన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక శాసన సభ్యుడిగా ఉండి తోటి శాసనసభ్యుడుపై దాడి చేయడం సిగ్గుచేటు కాంగ్రెస్ కార్యకర్తలు సంయనం పాటించాలని మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) చెప్పడం వల్లే నిన్నటి రోజు కౌశిక్ రెడ్డి క్షేమంగా ఇంటికి వెళ్ళాడు, లేకపోతే కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కు వెళ్లేవాడు కాదన్నారు. కౌశిక్ రెడ్డి నీ ప్రవర్తన మానుకో నీ నాయకుల మెప్పు కోసం ఇలాంటి దుండుడుకు చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి హెచ్చరిస్తున్నా అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, ఎండి తాజ్ ,ఆకుల ప్రకాష్ ,కొరివి అరుణ్ ,వాసాల రవీందర్, లక్ష్మీనారాయణ, ఉప్పరి రవి, కరీం, తదితరులు పాల్గొన్నారు.