calender_icon.png 14 March, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే అధికారులకు మాజీమంత్రి విన్నపం

12-03-2025 12:27:39 AM

మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ మోతీనగర్ వద్ద సీసీ రోడ్డు వేయడానికి అనుమతి ఇవ్వాలని రైల్వే అధికారులను కోరిన మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ మార్చి 11 (విజయ క్రాంతి) : సికింద్రాబాద్ లోని రైల్వే భవన్ లో మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్  రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ను స్థానికులతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోతీ నగర్ లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద సిసి రోడ్డు వేయడానికి రైల్వే పర్మిషన్ ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.

స్థానిక ప్రజలు వెళ్ళడానికి, అత్యవసర సమయాలలో అంబులెన్స్ ల రాకపోకలకు రైల్వే  స్థలం నుండి అప్రోచ్ రోడ్డు వేయడానికి అనుమతి ఇవ్వాలని రైల్వే అధికారులకు మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్  వివరించారు. గతంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ను కలిసి సద్దల గుండు రోడ్డు, మోతినగర్ రోడ్డు కు అనుమతి తీసుకొని మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుండి సీసీ రోడ్డు వేయడం జరిగిందని గుర్తు చేశారు.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదామ్ వద్ద మున్సిపాలిటీ నుండి సీసీ రోడ్డు వేయడానికి అనుమతి ఇవ్వాలని డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ను కోరగా, పరిశీలిస్తామని సానుకూలంగా స్పందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.