21-04-2025 12:00:00 AM
మేడ్చల్, ఏప్రిల్ 20(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం లోని పోచారం మున్సిపాలిటీ పరిధిలో పోచమ్మ, ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రులు టి హరీష్ రావు, చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేశారు. పురోహితులు ఆశీర్వచనా లు అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు. అంతకు ముందు ఘట్కేసర్ రింగ్ రోడ్డు నుంచి పోచారం వరకు పార్టీ కార్యకర్తలు భారీ కాన్వాయ్ తో స్వాగతం పలికారు.