24-02-2025 12:18:21 AM
రేవల్లి, ఫిబ్రవరి 23: మండల పరిధిలోని చెన్నారం గ్రామానికి చెందిన బంకల జ్యోతి ఇంటికి ఈనెల11న అర్దరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు అంటుకోవడంతో ఇంట్లో ఉన్న సామాను దగ్దంఅయి నిరాశ్రయులైనరు,విషయం తెలిసిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాద బాధితురాలికి రూ 10వేలు ఆర్థిక సహాయం అందించి దైర్యం కల్పించారు.
విద్యుత్ అధికారులతో చర్చించి ప్రభుత్వ పరంగా పరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందిమల్ల అశోక్,రాజురెడ్డి, రమేష్ యాదవ్, బుచ్చిదాస్, మహమ్మద్, సత్తార్, ఈశ్వరయ్య,పెద్ద రాముడు, బత్కయ్య, ఇసుక రాములు, నాగభూషి, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు