17-02-2025 08:04:43 PM
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన పూజారులు..
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పెద్దమ్మ తల్లి ఆలయంలోని శివాలయంలో సోమవారం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు దంపతులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న వనమా దంపతులకు పెద్దమ్మ తల్లి ఆలయ పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు చేయించారు.
అనంతరం వనమా మాట్లాడుతూ... ముల్లోకాలకు అధిపతిగా ఉన్న శివుని ఆలయాన్ని పాల్వంచలోని జగన్నాధపురంలో గల పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో శివాలయాన్ని ఏర్పాటు చేయటం హర్షనియమన్నారు. శివపార్వతులకు వనమా ఆయన సతీమణి పద్మావతిలు పట్టు వస్త్రాలను సమర్పించారు. భక్తిశ్రద్ధలతో ఆ దంపతులిరువురు శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారి లేచిన తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.