calender_icon.png 14 March, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో గురువారం చీకటి రోజుగా మిగులుతుంది

13-03-2025 09:45:20 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): నిండు అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యం గొంతు నొక్కిందను మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు(Former Minister Vanama Venkateswara Rao) అన్నారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి  జైళ్లకు పంపడం.. ప్రజలెదుర్కొంటున్న  సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తే సస్పెండ్ చేయడం శోచనీయ మన్నారు. శాసనసభాపతిగా ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదించినప్పుడు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడాన్ని గుర్తు గుర్తు చేశారు. సభ్యుడి వివరణ కూడా అడగకుండా సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. ఒక పథకం ప్రకారం ముందే అనుకుని ప్రధాన ప్రతిపక్ష సభ్యుడు, జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారన్నారు. ప్రజలపక్షాన రాజీలేని పోరాటాలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభకు దూరం చేయాలని అధికార పక్షం కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ను వెంటనే ఎత్తేసి ప్రజాస్వామ్యం విలువలను పరిరక్షించాల్సిందిగా గౌరవ శాసనసభాపతి ప్రసాద్ కుమార్ ని కోరారు.