ప్రపంచ వెదురు దినోత్సవంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పేదలకు అన్యాయం జరిగిందని వారి పక్షాన నిలబడితే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇది సరైన విధానం కాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వెదురు దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. 523 సర్వేనెంబర్ నందు నిరుపేదల ఇల్లు కూడా కొట్టి నిరసనలు అయితే వారికి చేతగా నిలబడితే తప్పుడు ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
ప్రజలకు మంచి చేయాలి తప్ప అనవసరమైన రాద్ధాంతం చేస్తూ కాంగ్రెస్ వారు కాలం గడుపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మా హయాంలో మేదరుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, సంఘ భవనానికి స్థలంతో పాటు మేదరుల్లో పేదవారికి రెండు పడక గదులు కేటాయించమని పేర్కొన్నారు. పదేళ్లలో మహబూబ్ నగర్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తి అవుతున్న ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, కౌన్సిలర్లు గణేష్, రామ్ లక్ష్మణ్ ,సీనియర్ నాయకులు సాయిలు, శ్రీనివాస రెడ్డి, గణేష్, భాస్కర్ కిషన్ పవర్, మేదరి సంఘం జాతీయ అధ్యక్షులు వెంకట రాముడు, గౌరవాధ్యక్షులు రాజేందర్ పట్టణ అధ్యక్షులు సత్యం, యువత అధ్యక్షులు సుధాకర్, ఆంజనేయులు, రాములు తదితరులు పాల్గొన్నారు.