బీఆర్ఎస్ అభివృద్ధికి కట్టుబడి పని చేసిండ్రు
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి దక్కుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కార్యాలయంలో పార్టీకి సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్లను శాలువ పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ... పుట్టిన గడ్డ రుణం తీసుకునేందుకు మాత్రమే ఇక్కడికి వచ్చానని.. 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చే పాలమూరుకు ప్రతిరోజు నేను అందించే స్థాయికి తీసుకు వచ్చామని స్పష్టం చేశారు.
తెలంగాణలో మొదట మన నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన ట్యాంక్ బండ్, బై పాస్ రోడ్, జంక్షన్ ల విస్తరణ, కమ్యూనిటీ హాల్స్, మెడికల్ కాలేజీ, వెయ్యి పడకల ఆస్పత్రి.. మన్యం కొండా.. కల్వరి కొండా.. దర్గాలు.. మసీద్ ల అభివృద్ధి చూస్తే శ్రీనివాస్ గౌడ్ ప్రజలకు గుర్తుకు తప్పకుండా వస్తాడని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడం లేదని విమర్శించారు. బిఆర్ఎస్ బి ఫామ్ తో గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కౌన్సిలర్ల కు భవిష్యత్తులో ప్రజలు బుద్ధి చెప్తారని అసహనం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు మంచి భవిష్యత్తు ఉందని, పార్టీ పటిష్టం కోసం ప్రతి ఒక్కరూ శాశక్తులకు కృషి చేయాలని పేర్కొన్నారు.
పట్టణ అభివృద్ధికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎంతో సేవ చేశారని వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న,కార్యక్రమంలో మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, హన్వాడ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, కౌన్సిలర్ లు గణేష్, వనజ ,అనంతరెడ్డి, రామలక్ష్మణ్, వేదావత్, పటేల్ ప్రవీణ్, సీనియర్ నాయకులూ సాయిలు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ, పాల సతీష్, జావేద్, నవకాంత్, వినోద్ కుమార్, చిట్యాల సుధాకర్, అహ్మద్ అలీ సన, మఖ్బూల్, అహ్మదుద్దిన్, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.