16-04-2025 12:00:09 PM
క్వారీలో పడి ముగ్గురు చనిపోతే పలకరించే సమయం లేదా
పరామర్శించాలంటే పర్మిషన్ ఉండాల్నా..
మృతుల కుటుంబాల లను ఓదార్చిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రజా సంక్షేమం కోసం ఉన్నఅధికార యంత్రాంగం.. ఆ ప్రజలు ముక్తివాతపడ్డ కూడా వారి కుటుంబాలను పరామర్శించడం లేదంటే.. ఎంతమంది మరణిస్తే పరమేశిస్తారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పట్టణ సమీపంలోని దివిటిపల్లి డబుల్ బెడ్ రూమ్ లలో నివాసం ఉంటున్న ముగ్గురు వ్యక్తులు సమీపంలో ఉన్న క్వారీలో నీటిలో మునిగిపోయి మరణించిన వారి మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ హాస్పిటల్ లో ఉండడంతో వెంటనే పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందించాలని, అనంతరం కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓదార్చారు.
ఈ సందర్భంగా మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కిరాయి ఇండ్లలో ఉంటున్న పేదలకు మూడు యేండ్ల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన ఇండ్లను పేదలకు ఇచ్చామని, ఇక్కడ నివాసం ఉండి చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతున్న కుటుంబాల్లో అనుకోని విషాదం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. చేతికి వచ్చిన పిల్లలు కుటుంబాలకు ఆసరా ఉంటారని అనుకునుకుంటున్న సమయంలో క్వారీ గుంతలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందడం తమను ఎంతో కలిసి వేసిందని పేర్కొన్నారు. ముగ్గురు చనిపోతే కనీసం కలెక్టర్, ఎస్పీ వచ్చి ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. చిన్న జిల్లాలు అయితే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని అనుకున్నామని,
కలెక్టర్.. ఎస్పీ ప్రమాద స్థలంను పరిశీలించి మృతుల కుటుంబాలని ఆదుకోవాలన్నారు. మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు పర్యటించాలంటే ఎవరి నుంచి అయినా అనుమతులు తీసుకోవాలా..? జరిగిన ప్రమాదం పెద్దదన, వెంటనే క్షేత్ర స్థాయి లో పర్యటించి మృతుల కుటుంబాల్లో భరోసా నింపాలన్నారు. క్వారీ కి అన్నీ రక్షణ చర్యలు తీసుకునే విధంగా చూడాలన్నారు. కుటుంబాలకు ప్రభుత్వ సహాయ అందేవిధంగా ఉన్నతాధికారులతో మాట్లాడుతనని కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన వారిలో గ్రంధాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ పట్టణ అధ్యక్షులు శివరాజ్, సీనియర్ నాయకులు రాఘవేందర్ గౌడ్, అంబాదాస్, శివ, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.