మహేశ్వరం,(విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్ గూడలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి మఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పి.సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మతంలో దేవుడు ప్రజలు అందరూ సమానమేనని, అందరూ ప్రశాంత వాతావరణంలో సుఖ సంతోషాలతో జీవిచాలని కోరుకుంటాడాని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.