ఆదిలాబాద్ (విజయక్రాంతి): బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ రోకండ్ల రమేష్ అంత్యక్రియల్లో మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గుండెపోటుతో శనివారం రోకండ్ల రమేష్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రోకండ్ల రమేష్ మృతదేహాన్ని దర్శించి నివాళులర్పించారు. ఆదివారం నిర్వహించిన అంత్యక్రియాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న రోకండ్ల రమేష్ మృతదేహంపై పార్టీ కండువా కప్పారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు ఉమ్మడి జిల్లా నుండి ఆయా పార్టీల నేతలు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాధ సప్త హృదయాల నడుమ తమ అభిమాన నేతకు వీడ్కోలు పలికారు. తిర్పేల్లి స్మశాన వాటిక వరకు శవయాత్ర కొనసాగింది. మాజీ మంత్రి రామన్న రోకండ్ల రమేష్ పాడే మోశారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు.