calender_icon.png 21 September, 2024 | 3:03 PM

పంటలు కోతకు వచ్చినా.. ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వలే

21-09-2024 01:13:08 PM

ఫసల్ బీమా యోజన గొప్పదైతే.. ఎందుకు అమలు చేయలేదు

వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చిందా?

హైదరాబాద్:  పంటల కోతకు వచ్చినా ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేని దురావస్థకు ప్రభుత్వం వచ్చిందన్నారు. వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. గుజరాత్ లో ఫసల్ బీమా యోజనను అమలు చేయలేదు, ఫసల్ బీమా యోజన గొప్పదైతే గుజరాత్ లో ఎందుకు అమలు చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు.

ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి ఎవరైనా చెబితే వినే స్వభావం లేదని విమర్శించారు. రైతుల మేలు కోసం సూచనలు తీసుకుందామనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. కూలీ రైతులకు ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని కాంగ్రెస్ గతంలో హామీ ఇచ్చింది. ప్రస్తుతం కూలీ రైతులకు రూ. 15 వేలు ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ఏపీ కౌలుదారీ చట్టంతో పోలిస్తే మన చట్టం వేరు అన్నారు. తలసరి భూవిస్తీర్ణం ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువన్నారు. ఏపీ కౌలుదారీ విధానాన్ని తెలంగాణలో వర్తించడమే కాంగ్రెస్ విధానమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలకు అంతే లేకుండా పోయిందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.