calender_icon.png 2 March, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ వల్ల ఏ ఒక్క కులానికి అన్యాయం జరగలేదు

01-03-2025 10:55:41 PM

షమీమ్ అక్తక్ కమిషన్ శాస్త్రీయ పద్దతిలో పూర్తి చేసింది

వర్గీకరణను అడ్డుకునేందుకు మందకృష్ణ మాదిగ కుట్రలు చేయడం సరైంది కాదు

అమరవీరుల కుటుంబాలను ఆదకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

మాదిగ అమరవీరుల త్యాగాల వల్ల ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది

పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య

ముషీరాబాద్,(విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ(SC Classification) వల్ల ఏ ఒక్క కులానికి అన్యాయం జరగలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(Former Minister Motkupalli Narasimhulu) అన్నారు. జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ శాస్త్రీయ పద్ధతి(Justice Shamim Akhtar Commission Scientific Method)లో పూర్తి చేశారని, మందకృష్ణ మాదిగ కమిషన్ నివేదికలో లోపాలున్నాయని, ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు కుట్రలు చేయడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(Madiga Martyrs' Commemoration Day) సందర్భంగా మాదిగ, మాదిగ అనుబంధ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్ని మోత్కుపల్లి నర్సింహులు, టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, వేదిక ప్రతినిధులు జన్ను కనకరాజు మాదిగ, ఇటుక రాజు మాదిగలతో కలిసి ఆయన మాట్లాడారు.

ముందుగా ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనర్సింహలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గత 30 ఏండ్ల సుధీర్ఘ పోరాటం, ఎస్సీ వర్గీకరణ అమరుల త్యాగాల ఫలితమేనని, ఈ ఘనత అమరులకే దక్కుతుందని అన్నారు. ఎస్సీ వర్గాకరణ అంశాన్ని మందకృష్ణ మాదిగ పక్కదారి పట్టించేందకు కుట్రలు పన్నారని ఆరోపించారు. వర్గీకరణ జరిగిన తరువాత మందకృష్ణ మాదిగ వారం రోజులు అడ్రస్‌లేకుండా పోయాడన్నారు. ఒక అన్నగా పదిసార్లు ఫోన్ చేసినా స్పందిచండం లేదన్నారు. 30 ఏండ్లు మందకృష్ణకు వెన్నుదన్నుగా ఉన్న తనను అవమానించారని ఆయన ఆదేదన వ్యక్తం చేశారు. మాదిగ అమరవీరులను మందకృష్ణ మాదిగ పరామర్శించిన పాపాన పోలేదని అన్నారు. ఇప్పటికే మాదిగ జాతి నష్టపోయిందన్నారు. మాదిగ జాతిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం సాధ్యం కాదన్నారు. కేవలం నువ్వు కీలుబొమ్మ మాత్రమేనని, మూడు సార్లు పోటీ చేసినాగాని డిపాజిట్ రాలేదన్నారు. అసలైన మాదిగలు నీ వెంట లేరని మోత్కుపల్లి మందకృష్ణ మాదిగపై ఘాటు విమర్శలు చేశారు.

ఇప్పటికైనా మందకృష్ణ తన వైఖరి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. మాదిగ, మాదిగ ఉపకులాలు ప్రభుత్వం చేస్తున్న వర్గీకరణకు పూర్తి అండగా ఉండాలని కోరారు. మంత్రి దామోదరం రాజనర్సింహపై మండకృష్ణ మదిగ చేస్తున్న వ్యక్తిగత విమర్శలపై మోత్కుపల్లి తిప్పికొట్టారు. మాదిగలకు రెండు మంత్రి పదవుల అంశంపై మందకృష్ణ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గతమన్నారు. ఎస్సీ వర్గీకరణ వల్ల విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మాదిగ, మాదిగ అనుబంధ కులాలలో పెరుగుతాయన్నారు. ఇప్పిటికైనా మందకృష్ణ మాదిగ నోరు మూసుకుంటే మంచిదన్నారు. మాదిగలు ఎవరూ మందకృష్ణ మాదిగ మాటలను నమ్మాల్సినవసరం లేదన్నారు. మాదిగ అమరవీరుల కుటుంబాలను  ఆదుకునేందుకు త్వరలో ఒక ట్రస్టు ఏర్పాటు చేసిన మాదిగ, మాదిగ అమరవీరుల కుటుంబాలకు నిధులు అందజేస్తామని అన్నారు.

అమరవీరుల కుటుంబాలకు మాదిగ మేధావులు, ఉద్యోగులు, సాయం చేయాలని ఆయన కోరారు. టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య మాట్లాడుతూ 30 ఏండ్ల సుధీర్ఘ పోరాటం, మాదిగ అమరవీరుల త్యాగాల వల్ల ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు. మాదిగ అమరవీరుల కుటుంబాలకు ఐక్యవేదిక పక్షాన అండగా ఉంటామన్నారు. అమరవీరుల కుటుంబాలను మందకృష్ణ ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు మందకృష్ణ మాదిగ సహకరించాలన్నారు. ఈ సందర్భంగ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదరం రాజనర్సింహలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మల్లేశం, ముంజగల విజయ్ కుమార్ మాదిగ, మేరీ మాదిగ, జన్ను కనకరాజు మాదిగ, ఇటుక రాజు మాదిగ, చింత స్వామి మాదిగ, సంగీతం రాజలింగం తదితరులు పాల్గొన్నారు.