calender_icon.png 18 October, 2024 | 1:33 PM

వాస్తవాలు తెలుసుకుంటే.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది

27-07-2024 11:53:55 AM

హైదరాబాద్: గ్యారంటీలు, హామీలు అమలు చేయలేదని ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభలో బడ్జెట్ పద్దుపై చర్చ కొనసాగుతోంది. ఆరు గ్యాంరెంటీల గురించి అడిగితే సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారని హరీశ్ రావు తెలిపారు. గ్రూప్-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు అడిగితే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల్లో 6 గ్యారెంటీల అమలు చేస్తామని సోనియాతో లేఖ రాసి పంపిణీ చేశారని గుర్తుచేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తాము కొనసాగించామని ఆయన వెల్లడించారు. కేసీఆర్ కిట్ లాంటి పథకాలు పేర్లు మార్చి పంపిణీ చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేశామని విమర్శించారు. తాము అప్పులు చేసింది.. ఆస్తుల కల్పన కోసం చేశామని పేర్కొన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన నిధులు తెచ్చుకున్నారు. వాస్తవాలు తీసుకుని సరిచేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని హరీశ్ రావు సూచించారు.