11-04-2025 12:34:25 AM
మేడ్చల్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జపాన్ లో చిల్ అవుతున్నారు. ఈనెల 3న కుటుంబ సభ్యులతో జపాన్ వెళ్లిన మల్లారెడ్డి అక్కడ వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. టోక్యో నగరంలోని డిజిటల్ లైట్ స్టూడియోలో ఫ్యామిలీతో ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేశారు. విదేశీయులతోనూ ఫోటోలు దిగారు. కూవన నగరంలోని ప్లాంట్ నర్సరీ సందర్శించి అందాలను ఆస్వాదించారు. బుల్లెట్ ట్రైన్ లోను ప్రయాణించారు. ఈనెల 13న స్వదేశానికి రానున్నారు.