calender_icon.png 18 January, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీవియోగం

11-09-2024 02:35:49 AM

మాజీ సీఎం కేసీఆర్ సంతాపం

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతాలక్ష్మారెడ్డి(50) మృతిచెందారు. గత కొ ంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి క న్నుమూశారు. మంగళవారం స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మం డలం ఆవంచలో అశేష జనవాహిని మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. లక్ష్మారెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరింజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్న ం శ్రీనివాస్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు లక్ష్మారెడ్డిని పరామర్శించారు. లక్ష్మారెడ్డి రాజకీ య జీవితంలో శ్వేతాలక్ష్మారెడ్డి నిరంతరం తోడుగా ఉన్నారు.