calender_icon.png 12 March, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'తీగల' కుటుంబానికి మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శ

11-03-2025 09:01:56 PM

ఎల్బీనగర్: ముసారాంబాగ్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితోపాటు పలువురు మంగళవారం సునరితరెడ్డి ఇంటికి వచ్చి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ఉద్యమకారులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.