calender_icon.png 2 April, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా

27-03-2025 03:14:00 PM

  1. అధికారంలో ఎవరున్నా.. తెలంగాణ బాగుండాలన్నదే మా సంకల్పం
  2. పదవులు శాశ్వతం కాదు.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు
  3. మనకు జరిగిన అన్యాయంపై మాట్లాడకపోవడం బాదేసింది
  4. కేంద్రబడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది
  5. తెలంగాణకు మేలు జరగాలి.. తెలంగాణ ప్రజలు బాగుండాలి
  6. కొట్లాడకపోతే కేంద్రం నిధులు ఇవ్వదు.. పోరాడాల్సిందే
  7. మనం అడగకపోతే కేంద్రం నిధులు ఇవ్వదు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్(Former Minister KTR ) మాట్లాడుతూ...ఇటీవలే సెక్రటేరియట్, అసెంబ్లీలు కట్టుకున్నారు. ఏర్పడిన మొట్టమొదటి దశాబ్ద కాలంలోనే మెరుపు వేగంతో దూసుకెళ్లింది మన తెలంగాణే అని కేటీఆర్ అన్నారు. స్వల్ప సమయంలో ఇంత ప్రగతి సాధించడం మనందరికి గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రాల ఏర్పాటు అనేది 1952 నుంచి కొనసాగుతూ వస్తుందని చెప్పారు. చివరగా 2001లో నాటి ఎన్డీయే ప్రభుత్వం 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్ రెండున్నర దశబ్దాల్లో ఇంకా బాలారిష్టాలు అధిగమించలేదన్నారు. గత పదేళ్లలో అభివృద్ధి పథంలో మెరుపు వేగాన్ని ఆవిష్కరించి తెలంగాణను అగ్రగామిగా కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) నిలబెట్టారని ఆయన గుర్తుచేశారు. పరిపాలనలో కొత్త ఒరవడిని, ప్రణాళికల రూపకల్పనలో సరికొత్త పంథాను అనుసరించామని తెలిపారు. 2014 నుంచి 2022 వరకు వృద్ధి రేటు తీసుకుంటే 17.57 శాతంతో తెలంగాణ అగ్రగామిగా నిలబడిందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణకు మేలు జరగాలి.. తెలంగాణ ప్రజలు బాగుండాలి.. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. తెలంగాణ బాగుండాలన్నదే మా సంకల్పమని కేటీఆర్ స్పష్టం చేశారు. పదవులు శాశ్వతం కాదు.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని సూచించారు. కేంద్ర బడ్జెట్ లో  మను జరిగిన అన్యాయంపై మాట్లాడకపోవడం బాదేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రబడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న కేటీఆర్ తెలంగాణ పథకాలను కేంద్రం అనుకరిస్తోందన్నారు. మనకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడకపోవడం బాదేసిందని చెప్పారు.

పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఒక్క సీటు కూడా రాలేదని విమర్శించారు.. మాకు వచ్చిందే సున్నానే. కాంగ్రెస్ 8 మంది ఎంపీలు, బీజేపీ 8 మంది ఎంపీలు కలిసి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తెచ్చింది మాత్రం గుండు సున్నా అని కేటీఆర్ ఎద్దేవా చేశారుకొట్లాడకపోతే కేంద్రం నిధులు కూడా ఇవ్వదు.. పోరాడాల్సిందేనని పిలుపునిచ్చారు. కేంద్రంతో గట్టిగా మాట్లాడేందుకు మేము కూడా మద్దతిస్తామని సూచించారు. సత్సంబంధాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు.. మేము కూడా కేంద్రంతో సఖ్యతతో ఉన్నాం.. ఏమీ రాలేదన్నారు.

కేంద్ర బడ్జెట్(Union Budget 2025-2026) లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడట్లేదు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి పనిలో గత ప్రభుత్వం అని విమర్శిస్తున్నారు.. కేంద్రంపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు కేంద్రం ఒక్క రూపాయైనా ఇచ్చిందా? సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కుంభమేళాకు కేంద్రం నిధులు ఇస్తుంది.. సమ్మక్క సారలమ్మ జాతరకు ఎందుకు నిధులు ఇవ్వరని గట్టిగా అడిగారు. మనం అడగకపోతే కేంద్రం నిధులు ఇవ్వదు. అప్పులపై ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్థిక వ్యవస్థ గురించి ఎవరికీ పెద్ద అవగాహన లేదని చెప్పారు. 10 ఏళ్ల తర్వాత సకల సౌకర్యాలతో రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పామని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినవన్నీ దీర్ఘకాలిక రుణాలు అని ఆయన స్పష్టం చేశారు. మేం తెచ్చిన అప్పులతో ఆస్తులు సృష్టించాం, అభివృద్ధి పనులు చేశామని తేల్చిచెప్పారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే.. దానితో అభివృద్ధి జరుగుతోందన్నారు. అమెరికాలాంటి దేశాలు కూడా జీడీపీలో 129 శాతం మేర అప్పులు చేశాయి. అప్పులులేని దేశం కానీ, వ్యక్తి కానీ ఉండరని చెప్పారు. అప్పులకు తగినట్లే రాష్ట్ర సంపద కూడా పెరిగిందన్నారు. ధాన్యం ఉత్పత్తిలో 2022లోనే హరియాణా, పంజాబ్ ను కూడా మించిపోయామని గుర్తుచేశారు. సాకుకు ఉచిత విద్యుత్ కోసమే రూ. 61 వేల కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.