18-03-2025 08:29:20 PM
కూకట్ పల్లి (విజయక్రాంతి): కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లిలోని బడే మసీద్(Bade Majeed) లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు(Iftar Dinner) కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరి సోదరీమణులు కఠిన ఉపవాస దీక్ష తీసుకొని ఆత్మీయ మత సామ్రాస్యానికి ప్రత్యేకగా నిలిచే రంజాన్ మాసంలో వారిలో భక్తి భావాన్ని పెంపొందించుకోవడం గర్వించదగ్గ విషయం అన్నారు.
రంజాన్(Ramadan) ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఎంతగానో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అల్లా దయతో అందరూ ఆయురారోగ్యాలతో ఉంటూ వారు అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు(MLA Krishna Rao), ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంబిపూర్ రాజు, కార్పొరేటర్లు నరసింహ యాదవ్, జూపల్లి సత్యనారాయణ, సబిహా గౌసూద్దీన్, పండాల సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి, నాయకులు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.