calender_icon.png 1 November, 2024 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

15-07-2024 05:30:08 PM

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ శాసన సభ్యల హక్కులను ఉద్దేశపూర్వకంగానే కాలరాస్తోందని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ మా పార్టీ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ నేతలకు సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలను అప్పగిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యేల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘలనలు జరగకుండా స్పీకర్ అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై సీఎస్ శాంతి కూమరి, జిల్లా కలెక్టర్లకు స్పీకర్ ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ పేర్కొన్నారు.