calender_icon.png 23 December, 2024 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎకరానికి 17,500 బాకీ

22-12-2024 02:18:43 AM

  1. రైతన్నలకు రూ.26,775 కోట్లు కట్టాలె
  2. మార్పు మార్పు అని పథకం పేరు మార్చారు
  3. రైతుభరోసా ఎత్తివేసేందుకే ఉప సంఘం ఏర్పాటు
  4. రైతు ఆత్మహత్యలను 11 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించాం
  5. రైతుబంధుపై ప్రశంసలే కానీ దుర్వినియోగం కాలేదు
  6. కాంగ్రెస్ రూ.5౦౦ బోనస్ హామీ బోగస్ అయ్యింది
  7. వంద శాతం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా
  8. రైతుభరోసా చర్చలో మాజీ మంత్రి కేటీఆర్ సవాల్

హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక్కో రైతుకు ఎకరానికి రూ. 17,500 బాకీ పడింద ని.. వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కాం గ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పోయిన యాసంగి, రూ.2,500 ఈ యేడు వానకాలం రూ.7,500 , ఈ యాసంగిలో రూ.7,500తో కలిపి ఎకరానికి రూ.17,500 చేరిందని..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం సుమారు రూ.26,775 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు బాకీ పడిందని పేర్కొన్నా రు. ఈ విషయాన్ని రైతులందరూ గుర్తుంచుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ఎకరాని కి రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామనడంతోపాటు రెండు కాదు మూడు పంటలకు రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పిన ట్టు గుర్తుచేశారు.

మార్పు మార్పు అని పేరు మార్చి రైతు భరోసా అని అవే రూ.5 వేలు ఇ చ్చారని దుయ్యబట్టారు. శనివారం అసెంబ్లీలో రైతు భరోసాపైన స్వల్పకాలిక చర్చ సందర్భం గా కేటీఆర్ మాట్లాడారు. సాగు చేసే భూములకే రైతుభరోసా అంటూ ప్రభుత్వం పథకంలో కోతలు విధించే ప్రయత్నం చేస్తుందన్నారు. దీనివల్ల అనేక మంది రైతులు అర్హత కోల్పోతారని అవేదన వ్యక్తంచేశారు.

రాష్ర్టంలో అనేక చోట్ల మూడు పంటలు కూడా పండిస్తారని, అలాంటి వారికి మూడుసార్లు రైతుబంధు ఇ స్తారో లేదో ప్రభుత్వం చెప్పాలని కోరారు. ఏ డాదికి ఒకే పంటగా ఉండే పత్తి, కంది పంటల కు రెండుసార్లు ఇస్తారా.. ఇవ్వరా అనేది స్ప ష్టంచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 4.50 లక్షల పోడు పట్టాలున్నాయని, ఒక్క పంట  పండించే గిరిజన బిడ్డలకు రెండో విడత రైతు భరోసా ఇవ్వరా అని ప్రశ్నించారు. 

రైతుభరోసా ఎత్తేసేందుకే ఉప సంఘం 

70 లక్షల మంది రైతన్నలకు 1.53 కోట్ల ఎకరాల చొప్పున ప్రతి సీజన్లో ౭,౫౦౦ చొప్పున ఇవ్వాలంటే రూ.23 వేల కోట్లు అవసరమని.. కానీ, ప్రభుత్వం రూ.15 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించిందని కేటీఆర్ అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం కోతలకు సిద్ధపడిన తర్వాతనే ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది అనేది స్పష్టమవుతుందని చెప్పారు. రైతుబంధును ఎత్త గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

అందుకే టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు.  రాష్ర్టంలో పాన్‌కార్డులు ఉన్నవాళ్లు కోటి యా భై లక్షల మంది ఉన్నారని, వారందరికీ రైతుబంధు కట్ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వబోమని చెప్తున్నారని, రైతుబిడ్డ ప్రభుత్వ ఉద్యోగి అయితే తరతరాలుగా వాళ్లకి భూమితో ఉన్న బంధాన్ని తెంపివేస్తారా అని అడిగారు. వెంటనే మంత్రివర్గ ఉప సంఘం నివేదికను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.

గుట్టలకు, పుట్టలకు రైతుబంధు అని కట్టు కథనాలు రాయించారని మండిపడ్డారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని గతంలో రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. భూభారతిలో అనుభవదా రు కాలం పెట్టారు కాబట్టి వెంటనే 22 లక్షల మంది కౌలుదార్లకు రైతుభరోసా ఇవ్వాలని సూచించారు. 

పదేళ్లలో1.5 శాతానికి రైతు ఆత్మహత్యలు 

ఉమ్మడి రాష్ట్రంలో సాగు సంక్షోభంలో పడిందని, అన్నదాత వెన్ను విరిగిందని కేటీఆర్ అన్నారు. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యే సమయానికి రాష్ట్రంలో 11.1 శాతం ఉన్న రైతు ఆత్మహత్యలను పదేళ్లలో 1.5 శాతానికి తగ్గించామని స్పష్టంచేశారు. 2014లో 898 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, 2023లో ఆ సంఖ్యను 466కు తగ్గించామని ఉద్ఘాటించారు. దేశంలో రైతు ఆత్మహత్యలు తక్కువగా నమోదైన రాష్ట్ర జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిపామని చెప్పారు. 

రైతుబంధుకు దేశ వ్యాప్తంగా ప్రసంశలు 

11 సీజన్లలో రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని కేటీఆర్ స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం తెచ్చిన రైతుబంధు దేశ వ్యా ప్తంగా ప్రసంశలు అందుకున్నదని చెప్పారు. ఒడిశా, బెంగాల్ సహా అనేక రాష్ట్రాలు రైతుబంధును ఆదర్శంగా తీసుకొని నగదు బదిలీ పథ కాలను ప్రవేశ పెట్టాయని గుర్తుచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా రైతుబంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు.

అశోక్ గులాటీ, అరవింద్ సుబ్రహ్మణ్యం, రఘురాం రాజన్, అభిజిత్ బెన ర్జీ, దేవిందర్ శర్మ లాంటి ఎందరో ఆర్థిక వేత్తల నుంచి ఐక్యరాజ్య సమితి దాకా అందరి ప్రశంసలూ రైతుబంధు పథకం అందుకుందని గు ర్తుచేశారు. రాష్ట్రంలో 98 శాతం చిన్న, సన్న కారు రైతులే ఉన్నారని తెలిపారు. పాలమూరు జిల్లాలో 30 ఎకరాలున్న రైతుకూడా వలస కూలీలా వెళ్లే పరిస్థితి ఉండేదన్నారు.

రైతుబంధు దుర్వినియోగం కాలేదు 

రాష్ట్రంలో 91.33 శాతం లబ్ధిదారులు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న చిన్న సన్న కారు రైతులేనని, 5 నుంచి 10 ఎకరాలు ఉన్న మధ్య తరగతి రైతులు 7.28 శాతం, 10 ఎకరాలు పైబడి వున్నవాళ్లు 1.39 శాతం కాగా 25 ఎకరాలపైన ఉన్న పెద్ద రైతులు కేవలం 0.09 శాతం మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే రూ.72 వేల కోట్ల రైతుబంధులో పెద్ద రైతులకు పోయింది కేవలం 1.39 శాతమే అని గుర్తించుకోవాలని హితవు పలికారు.  రెతులు బాగుండాలంటే  రాయితీలు, ఇన్‌పుట్ సబ్సిడీలు ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ బోనస్ బోగస్ అయ్యింది 

ప్రతి పంటకు మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని  చెప్పి ప్రభుత్వం బోనస్ బోగస్‌లా మారిందని కేటీఆర్ ఎద్దేవాచేశారు. అధికారంలోకి వస్తే తొలి క్యాబినెట్ మీటింగ్‌లోనే హామీలకు, గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పొలంలో ఉండాల్సిన రైతులు జైళ్లలో ఉండాల్సి వస్తుందని, రైతన్న చేతికి సంకెళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. 

 నిరూపిస్తే రాజీనామా చేస్తా 

రాష్ర్టంలో ఏ గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ సవాల్ విసి రారు. రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమైతే డెడ్‌లైన్లు, అడ్డగోలు మాటలతో రుణ మాఫీ ఎత్తగొడుతున్నారని ఆరోపించారు. జూ న్ క్యాబినెట్ నిర్ణయాల్లో రూ.31 వేల కోట్లు మాఫీ అని, 47 లక్షల మందికి లబ్ధి అని ప్రకటించి బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు కేటాయిం చి కేవలం రూ.17,934 కోట్లతో 22.37 లక్షల మందికే రుణమాఫీ చేశారని ధ్వజమెత్తారు.  అదానీ కోసమో, అన్నదమ్ముల కోసమో, అ ల్లుడి కంపెనీల కోసమో, బావమరిది కోసమో కాకుండా రైతులకిచ్చిన హమీల అమలు కోసం పనిచేయాలని రేవంత్‌రెడ్డికి సూచించారు.