పెద్దపల్లి (విజయక్రాంతి): ధర్మారం మండల కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయులు దేవి రాజమల్లయ్య చిన్న కుమారుడు దేవి సిద్ధార్థ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడగా శుక్రవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. సిద్ధార్థ ఆరోగ్యం గురించి తండ్రి రాజమల్లయ్యతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. త్వరలోనే సిద్దార్థ కోలుకొని ఆరోగ్యంగా ఉంటాడని ధైర్యం చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.