calender_icon.png 23 September, 2024 | 4:08 AM

ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తుంది

08-09-2024 03:56:01 PM

రాష్ట్రంలో విషజ్వరాలు విజృభిస్తున్నా

ఒకే బెడ్ పై ముగ్గురు, నలుగురికీ వైద్య సేవలు : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

జగిత్యాల,(విజయక్రాంతి): రాష్ట్రంలో విషజ్వరాలు విజృభిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డెంగీ జ్వరాలతో ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించారు. గత నెల రోజులుగా విషజ్వరాలు పెరిగిపోతూనే ఉన్నాయని, ప్రాణంతకమైన డెంగ్యూ, చికెన్‌ గున్యా లాంటి రోగాలతో జనం ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో ఆగస్టు చివరి నాటికే ఎనిమిదిన్నర లక్షలకు పైగా విషజ్వరాల భారిన పడ్డారని, ఒకే బెడ్ మీద ముగ్గురు నుంచి నలుగురికీ వైద్య అందిస్తున్నా రన్నారు. ఆగస్టు 27న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4,459 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని, కాని డెంగీ కేసుతోనే కాదు, ఇతర ఏ విషజ్వరం వల్ల ఒక్క మరణం సంభవించలేదని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక ఇచ్చిందని తెలిపారు. డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతోంది కానీ పత్రికల్లో డెంగీ తో ప్రజలు చనిపోతున్నారని వార్తలు వస్తున్నాయని వివరించారు.

ప్రభుత్వం నిజాలను ఎందుకు దాచి పెడుతోందని మాజీ మంత్రి ప్రశ్నించారు. వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటనకు, క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులకు తీవ్రమైన వ్యత్యాసం ఉందని గుర్తు చేశారు. ఆగస్టు 27వ తేదీ నాటికే రాష్ట్రంలో 128 మంది విషజ్వరాల భారిన పడి మృతి చెందినట్లు స్పష్టమైన నివేదికలున్నాయని తెలిపారు. పదిరోజుల్లో మరో 50 మంది విషజ్వరాలతో మృతి చెందారని,వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన నివేదికలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేవలం లక్ష లోపు మంది మాత్రమే జ్వరాల భారిన పడ్డారని పేర్కొన్నారని అన్నారు.కరీంనగర్‌లో 40వేల మంది, జగిత్యాలలో 18వేల మంది, సిరిసిల్లలో 16వేల మంది, పెద్దపల్లిలో 15,300ల మంది అని చెప్పారని, ఇవన్ని కాకి లెక్కలేనని తెలిపారు. జగిత్యాల జిల్లాలోనే దాదాపు యాభై వేల మందికి పైగా విషజ్వరాల బారిన పడ్డారని, ఇరవై మందికి పైగా డెంగ్యూ, చికెన్‌ గున్యా లాంటి ప్రమాద కరమైన విషజ్వరాల భారిన పడి మృతి చెందారన్నారు. మూడు, నాలుగు రోజుల క్రితమే సారంగాపూర్‌ మండలంలో ఒక సింగిల్‌ విండో సిఇఓ విషజ్వరంతో మృతి చెందగా, మల్లాపూర్‌ మండల యువకుడు విదేశాల నుండి వచ్చి వివాహం చేసుకున్న పది హను రోజులకే విషజ్వరంతో చనిపోయాదని గుర్తు చేశారు. 

జ్వరపీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు కిక్కిరిసిపోతుంటే, ప్రజలు విషజ్వరాలతో పిట్టలా రాలుతుంటే ప్రభుత్వం పట్టనట్టు చూస్తోందని ద్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాల లేకుండా పోయాయని,వైద్యుల సమయ పాలన పాటించిన దాఖలాలు లేవని, ఎప్పుడు వస్తున్నారో..ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదని, వారిపై పర్యవేక్షణ కరువైందని తెలిపారు.జగిత్యాల జిల్లాలోని ఏ ఒక్క ఆసుపత్రి ఒక్క మంత్రి, ప్రజాప్రతినిధి పరిశీలించిన దాఖలాలు లేవన్నారు. ఆసుపత్రుల్లో విషజ్వరాలకు సంబంధించిన మందులు అందుబాటులో లేవని, విష జ్వరాలకు సంబంధించిన మందులు బయట నుండి రోగులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందన్నారు. గత మూడు మాసాలుగా అజిత్రోమైసిన్‌, డైక్లోఫైన్‌ ఫార్ములాలకు చెందిన మందుల పంపిణీ జరగడం లేదు...ప్రస్తుతం విషజ్వరాలకు సంబంధించిన ట్రీట్మెంట్‌లో ఇవి కీలకమైనవి అని వైద్యులు చెబుతున్నారని అన్నారు. అజిత్రోమైసిన్‌ యాంటిబయటిక్‌ మందు, ఇది అత్యంత కీలకమైందని,కరోనా లాంటి కాలంలోను కోట్లాది మంది ప్రాణాలు కాపాడింది, డైక్లో మందుప్పులు... ఫివర్‌ను కంట్రోల్‌ చేస్తుందని,bఇలాంటి కీలమైన మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు.

మూడు మాసాలుగా ఆసుపత్రులకు నిధుల మంజూరు లేదంటున్నారని కేసీఆర్‌ హాయాంలో ఆసుపత్రుల్లో ఉంచిన బఫర్‌ స్టాక్‌ మందులే ఇన్నాళ్లు వినియోగిస్తూ వచ్చామని, బఫర్‌ స్టాక్‌ పూర్తి కావడంతో మందుల కొరత తీవ్రంగా ఏర్పడిందని వైద్య సిబ్బందే చెబుతున్నారని, ఆసుపత్రి సూపరిండెంట్‌ల వద్ద ఉన్న ప్రత్యేక నిధుల నుండి అత్యవసర మందులు తెచ్చుకునే పరిస్థితి ఉందని వైద్య సిబ్బంది వాపోతున్నార న్నారు. ఇలాంటి వార్తలను సమైక్య పాలనసేవాళ్లమని, కాంగ్రెస్‌ పాలన పుణ్యమా అని నేడు ఏ పత్రిక చూసినా మళ్లీ ఆ వార్తలే కనిపిస్తున్నాయని, విషజ్వరాలే కాదుఆసుపత్రుల్లో సేవలు కుంటుపడ్డాయని, కేసీఆర్‌ కిట్లు అందడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకప్పుడు ఎక్కువ ప్రసవాలు జరిగితే ప్రైవేట్‌లో ప్రసవాల సంఖ్య తగ్గిపోయిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 62 శాతం ప్రసవాలు నమోదు అయితే..! ప్రైవేట్‌లో 38 శాతం నమోదు అయ్యేవి ఇప్పుడు సీన్‌ రివర్స్‍ అయ్యిందని అన్నారు. ప్రైవేట్‌ లో 65శాతం ప్రసవాలు జరిగితే,ప్రభుత్వ ఆసుపత్రుల్లో 35శాతం నమోదు అవుతున్నాయని, ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పారదర్శకంగా విష జ్వ‌రాల‌ నివారణ కోసం చర్యలు చేపట్టాలన్నారు.విషజ్వరాల కారణంగా ఏ ఒక్కరు ప్రాణం కోల్పోకుండా చూడాలని, విష జ్వరాలు విజృంభించిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని సూచించారు.  పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరచాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, డెంగీ కిట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.