క్రికెట్ టోర్నమెంట్ లను ప్రారంభించిన మాజీ మంత్రి రామన్న...
ఆదిలాబాద్, (విజయక్రాంతి) : ఆదిలాబాద్ లో క్రీడాకారుల ప్రతిభ కొదవలేదని, ప్రతి ఒక్కరు క్రీడల వైపు మొగ్గుచూపుతూ ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఏ.సీ.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ 13వ సెషన్స్ పోటీల ప్రారంబోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట ఇటీవల మృతి చెందిన క్రీడాకారులు శ్రీహరి, సాగర్ ల చిత్ర పటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని, టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ... ఈ టోర్నమెంట్ ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడంలో కృషి చేస్తున్న ఏసీఎల్ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఆదిలాబాద్ నుండి రంజీ స్థాయిలో రాణించిన హిమతేజ క్రీడా స్ఫూర్తిని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించడంలో, క్రీడా మైదానాలను సైతం ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానీదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రహాల్లద్, సాజీదోద్దీన్, జగదీష్, సతీష్, రాజేశ్వర్, ఉన్నారు