calender_icon.png 12 January, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుబంధు, మహిళా సహాయం అందించాలని ఆందోళన

11-01-2025 09:19:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): అధికారులకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో 11 అబద్ధాలు 20 మోసాలు పేరుతో పరిపాలన చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్ పట్టణంలో రైతులతో కలిసి జాతీయ రహదారిపై రైతుబంధు సాయం వెంటనే అందించాలని, మహిళలకు 2500 చెల్లించాలని, కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందన్నారు. ఇప్పటికీ రైతుబంధు సాయం ఎక్కువట్టగా సగం మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరగలేదని పేర్కొన్నారు. రైతు సమస్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుంటే కేసులు పెట్టి వేధిస్తున్నారని టిఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్త కాదని తెలిపారు. రైతుల కోసం అవసరమైతే జైలకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంక్రాంతి లోపు రైతుబంధు సాయాన్ని అందించాలని రెండు లక్షల రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయాలని అన్నారు.