calender_icon.png 9 January, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటల పోటీల్లో క్రీడా స్ఫూర్తిని కనబరచాలి : మాజీ మంత్రి రామన్న

08-01-2025 01:56:39 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): క్రీడలతో పాటు విద్య పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకున్నప్పుడే అన్ని రంగాలలో విజయం సాధించవచ్చని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. జైనథ్ మండలంలోని మాకోడా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వివేకానంద యూత్ చేపట్టుతున్న క్రికెట్ క్రీడా పోటీలను బుధవారం గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. మొదట క్రీడాకారులకు పరిచయం చేసుకుని వారికి అభినందనలు తెలియజేశారు. అటు క్రీడకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు స్వయంగా బ్యాటింగ్ చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం హయాంలో మాకొడ లో క్రీడా ప్రాంగణానికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని కనబరిచి పోటీల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.