calender_icon.png 24 December, 2024 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్

13-09-2024 09:43:36 AM

రామన్న ఇంటి వద్ద భారీగా పోలీసులు...

ఆదిలాబాద్, (విజయక్రాంతి): మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ తో బిఆర్ఎస్ నిరసన కు పిలుపునిచ్చింది. దింతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ లోని శాంతి నగర్ లో గల జోగు రామన్న నివాసంకు పోలీసులు శుక్రవారం ఉదయం మే చేరుకుని ఆయన బైటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. జోగు రామన్న ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ నాయకుని ముందస్తుగా  హౌస్ అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు ఖండించారు.