18-04-2025 01:42:59 AM
భీమదేవరపల్లి, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి లో ఎప్రిల్ 27 న జరగబోయే కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గ మాజీ శాసనసభ్యులు వోడితలు సతీష్ కుమార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు 10 లక్షల మంది జన సమీకరణ చేయడం జరుగుతుందన్నారు.
బి ఆర్ ఎస్ రజిత మహాసభకు విచ్చేయనున్న అభిమానులు కార్యకర్తలు నాయకుల కోసం ప్రత్యేకంగా మంచినీటి వసతి తో పాటు మజ్జిగ ప్యాకెట్లను సమకూర్చడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కానీ విని ఎరుగని రీతిలో కేసీఆర్ మహాసభ ఉంటుందన్నారు. రజిత ఉత్సవ మహాసభను టిఆర్‌ఎస్ ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు విజయవంతం చేయాలని అన్నారు.