నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన ఆసుపత్రిలో చికిత్స పొందిన కుటుంబాలను రాష్ట్ర మాజీ మంత్రి ఏ ఇంద్రకన్ రెడ్డి శనివారం పరామర్శించారు. సోను మండలంలోని గాంధీ నగర్ చెందిన మత్స్య కార్మిక సంఘం ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మైసూర్ పైల్వాన్, మాదాపూర్ కు చెందిన రుక్మారెడ్డి న్యూ సాంగ్ కి చెందిన రమేష్ రెడ్డి పట్టణంలోని ఏం రెడ్డి కాలనీ చెందిన అశోక్ రెడ్డి కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈయన వెంట ఎఫెసీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.