02-03-2025 06:59:17 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మామిడా మండలంలోని వాస్తాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంగారం సతీమణి సీతాబాయి ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాందాస్ లింగు భాస్కర్ పాకాల రామచందర్ తదితరులు ఉన్నారు.