calender_icon.png 4 January, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయక దేవాలయంలో పూజలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు

01-01-2025 11:02:14 PM

జహీరాబాద్: సిద్ధి వినాయక దేవాలయంలో మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా న్యాల్కల్ మండలంలోని రేజింతల్ సిద్ధి వినాయక దేవాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వేద పండితులు ఆలయ మర్యాదలతో మాజీ మంత్రికి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సిద్ధి వినాయక దేవాలయంలో కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాటు చేశారు.