calender_icon.png 31 March, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీల గౌరవాన్ని పెంచింది కేసీఆర్

29-03-2025 12:24:18 AM

రంజాన్‌కు ప్రభుత్వ పరంగా ఆయన తోఫా ఇచ్చారు

మైనార్టీలకు కాంగ్రెస్ రూ.3300కోట్లు ఇచ్చి రూ.వెయ్యికోట్లే ఖర్చు చేసింది

మన్నే గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో..

మాజీ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్ సిటీబ్యూరో,(విజయక్రాంతి): మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసి వారి గౌరవాన్ని పెంచింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రంజాన్‌కు ప్రభుత్వ పరంగా ఆయన తోఫా ఇచ్చారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం మన్నే గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని లేక్‌వ్యూ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హరీష్‌రావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ, తదిరత నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ ఇఫ్తార్ విందును అధికారికంగా నిర్వహించని కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్‌తోఫా కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల కోసం రూ.3300కోట్లు కేటాయించిందని, వాటిలో రూ.వెయ్యికోట్లే ఖర్చు చేసిందని, ఈ సారి బడ్జెట్‌లో కోత పెట్టిందని ఆరోపించారు. ఇమామ్‌లు, మోజోన్లకు కేసీఆర్ ప్రబుత్వం జీతాలిచ్చిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన టేమరిస్ పాఠశాలలను ఇంటిగ్రేటెడ్‌లో కలపాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్ బస్తీ ప్రజలు నీళ్లకు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.