28-02-2025 12:24:38 AM
కడ్తాల్, ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి) : శ్రీశైలంలోని ఎస్.ఎల్.బీ.సీ సందర్శనకు మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరారు. గురువారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తో పాటు బిఆర్ ఎస్ శ్రేణులు హరీష్ రావు కు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికినవారిలో మాజీ జడ్పిటిసి దశరథ్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచిలు గూడూరు లక్ష్మీ నర్సింహారెడ్డి, కృష్ణయ్య, తులసీరామ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.