calender_icon.png 29 September, 2024 | 4:17 PM

మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దు

29-09-2024 02:49:22 PM

మురికి నీరు రాకుండా చెయ్యండి చాలు 

మూసీలోకి గోదావరి నీళ్లను తెస్తాం అంటున్న రేవంత్ రెడ్డి.. అది సాధ్యమేనా..? 

కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఉసురు తగులుతుంది 

మాజీమంత్రి హరీష్ రావు

బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్, జియగూడ మూసి బాధితులకు భరోసా

 రాజేంద్రనగర్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఉసురు తగులుతుందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మూసీ నది సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కారు డబ్బులు దోచుకునేందుకు ప్లాన్ చేస్తుందని మండిపడ్డారు. ఆదివారం ఆయన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి తదితరులతో కలిసి మూసీ నది బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని భరోసా ఇచ్చారు. ప్రత్యక్షంగా ముఖాముఖిగా వారితో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సర్కారు మూసీ నది సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయలు దండుకునేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పేదల గోస కాంగ్రెస్ సర్కార్కు పట్టడం లేదన్నారు. పేదల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. మూసేది మూసి నదిలోకి గోదావరి నీళ్లు తెస్తానంటున్న రేవంత్ రెడ్డి అది సాధ్యమేనా అని ప్రశ్నించారు. మూసినదిలోకి మురుగునీరు కలవకుండా చూస్తే చాలు అన్నారు. సుందరీకరణ పేరుతో పేదల ఇల్లు తీసుకుంటామంటే ఎలా అని ప్రశ్నించారు. ఆరోగ్యాలరీల అమలుకు డబ్బులు లేవంటూనే మూసి సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ధ్వజమెత్తారు. బలవంతంగా పేదల ఇల్లు తీసుకుంటే చూస్తూ ఊరుకోలేమన్నారు. కాలేశ్వరం పనికిరాదని చెప్పినా రేవంత్ రెడ్డి అక్కడి నుంచి మూసీ నదిలోకి నీళ్లు ఎలా తీసుకొస్తామని అంటున్నారని ప్రశ్నించారు. బాధితులకు విధాలుగా అండగా ఉండి వారి తరఫున పోరాటం చేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ తొమ్మిది నెలల కాలంలో కాంగ్రెస్ సర్కారులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.